అమ్మ Poem by Gireesh Raju

అమ్మ

అమ్మరా.. అమ్మరా..
నా జన్మకే చిరునామరా..
అమ్మరా.. అమ్మరా..
నా కనుల నిండిన వెలుగురా..

కలతే చెందిన నాడు,
కనులే తుడిచెను నాకు
కపటం లేనిది అమ్మేరా..

ఆటల్లో.. పాటల్లోనా..
అలుపెరుగక నాతో ఉండిన
అరుదైన నేస్తం అమ్మేరా..

నా ఆకలి తీర్చిన అమ్మకి,
నా భాదలనార్పిన ప్రేమకి,
బాసటగా నేనే ఉంటారా..
అమ్మరా.. అమ్మరా..
నా జన్మకే చిరునామరా..

అమ్మరా.. అమ్మరా..
నా కనుల నిండిన వెలుగురా..

ఏనాడు ఏదీ కోరక,
అడిగిందే ఇచ్చిన అమ్మకు,
ఏమిచ్చి ఋణమే తీర్చనురా..
నే చేసిన తప్పులనన్నీ,
మాపే తన చూపులతోటి,
నా పాలిట దైవం తానేరా..

నన్నే ప్రేమించే అమ్మకు,
నాలో సగమయ్యిన అమ్మకు
బాసటగా నేనే ఉంటారా..

అమ్మరా.. అమ్మరా..
నా కనుల నిండిన వెలుగురా..
- గిరీష్

అమ్మ
Friday, January 22, 2016
Topic(s) of this poem: mother,telugu poem
POET'S NOTES ABOUT THE POEM
The son is humming this poem and showing his love on his mother and remembering his attachment with her
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success