తోడుతో
పాలు పెరుగవుతుందని
చిలికితే
పెరుగు చల్లవుతుందని
తెలియకనా....! !
కళ్ళు
తరాజులవుతుంటాయి
తూకం వేస్తుంటాయి
నాలుక
మాటను వెలిగిస్తుంటది
చీకటి చాటున
ఒకడు తరిగిపోతాడు
ఇంకొకడు విరిగిపోతాడు
జేబుకు జేబువెనక గుండెకు
దూరం యెంతో చెప్పు
పారువెల్ల
22-12-2016
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem