To My Mother (Telugu) Poem by Thati pramod sai

To My Mother (Telugu)

అమ్మా! నవమాసాలు మోసి నీ ఊపిరి నాకు ప్రాణంగా పోశావు
నన్ను జీవితాంతం నీ గుండెల్లొ పెట్టి మోసేవు
నాలొ మెదిలె ప్రతీ హ్రుదయ స్పందన
నువ్వు నాకోసం చేసిన త్యాగాలను, నీ కన్నీరుని నాకు గుర్తుచెస్తున్నాయి
మమకారమనే ముద్దలో ప్రేమ అనే ప్రానం పొసి నువ్వు పెట్టిన ప్రతి గొరు ముద్ద నాకు నిన్ను గుర్తుచేస్తుంది..
చల్లని వెన్నెలను పంచే ఆ చందమామ నీ తియ్యని ఆప్యాయతని గుర్తుచేస్తుంది...
ఝుమ్మని పాడే ఆ తుమ్మెద తన్మయత్నంలొ నాట్యం చేసే ఆ మయూరి నీ జోల పాటని గుర్తుచేస్తున్నాయి...
ఎంత బాదనైన మరిపించె నీ చల్లని ఒడి...
ఊటలా నీ హ్రుదయంలో పొంగే ప్రేమ..
అమ్మా ఈ ప్రపంచంలో నీకు ఎమి ఇవ్వగలను...
మల్లీ నీ ఒడిలొ బొమ్మలా జన్మించడం తప్ప....

To My Mother (Telugu)
Monday, February 20, 2017
Topic(s) of this poem: mother
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success