Silence In My Heart _ Telugu Version Poem by praneeth remidi

Silence In My Heart _ Telugu Version

ఎక్కడ పుట్టింది ఈ నిషబ్ధం

ఒక మధ్య రాత్రి ఉరుముల వెలుగులో వెలిగిన
నడి సంధ్రమున నిద్రిస్తున్న నత్తగుళ్ల లో పుట్టింది.


నీ వద్దకి ఎలా వచ్చింది ఈ నిషబ్ధం

పచ్చిరేగడి మట్టిపై పాకుతున్న నత్త బుజమ్పై పరుగెత్తుతు వచ్చింది.


ఏమిటీ ఈ కన్నీరు, ఆ నిషబ్ధం వల్లనా

కాదు.. అతి సాంధ్రత భావాల మైదానంలో 
వైరం ధర్మం కొట్లాటలో వచ్చిన స్వేధం.



ఎందుకు చేరాణిచ్చవ్ ఆ నిషబ్ధాన్ని నీ హృదయంలోకి

సప్తవర్ణాల స్వర్ణస్వప్నాల రథం మీద విరజాజుల వర్షంలో
తడుస్తూ వస్తుందని నా ప్రేయసి కోసం 
నిరీక్షించి నీరసించి నిద్రించిన నా హృదయంలోకి
అదును చూసి అనుమతి లేకుండా చొరబడింది 
ఈ భయంకర నిషబ్ధం


ఎటు వెళ్లిపోయింది నీ స్వప్నాల రథం

అమావాస్య అని మరచి నడి సంద్రపు దారిలో 
రాత్రి బయల్ధేరిన నా స్వప్నాల రథం
మెరుపు తాకిడికి విరిగి విసికి కరిగి తరలి పోయింది
నిషబ్ధం పుట్టిన ఆ నత్థగుల్ల్ల లోకి.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success