అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి (A Telugu Poem) Poem by ROCHISH MON

అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి (A Telugu Poem)

అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి, చీకట్లో
చీకటికి తెలియని నక్షత్రాలు అవి

మనం వాటిని చూడడం లేదు
వాటిని చూడాలంటే కొద్దిగా ప్రయత్నించాలి అంతే

ఆ నక్షత్రాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు
చాలా కాలంగా అవి అక్కడే ఉన్నాయి

మనం వాటిని చూడడం లేదు,
మనలో మనం ఇరుక్కుపోవడం వల్ల
మన ధోరణులనుంచి మనం బయటకు రావల్సిందే
వాటిని చూడాలంటే

తప్పుడుతనం చుక్కానై మనల్ని నడిపిస్తోంది
పర్యవసానంగా మన జీవితాలు కాలిపోతున్నాయి
మనం మన ప్రవర్తనలలో పడిపోయాం
చేరవలసిన ఎత్తులకు మనం వెళ్లడం లేదు

చెడ్దతనం మన సహజ గుణం
మన బ్రతుకులకు భాగస్వామి
చెడ్దతనం మనకున్న గుర్తింపు
మనల్ని ఆ నక్షత్రాలను చూడనివ్వదు


మన చర్యలకు ప్రతిఫలంగా
వైషమ్యాలు, ఘోరాలు విశృంఖలంగా విజృంభిస్తున్నాయి

అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి
మన జీవన శైలిని మనం మార్చుకోవాలి
అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి
మన నడతను మనం దిద్దుకోవాలి
అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి
మన చూపులు సరిగ్గా ఉండాలి
అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి
మనకు స్వచ్ఛమైన దర్శనాలు కావాలి

అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి

విఫలం కాకుండా ఆ నక్షత్రాలను చూడాలి మనం
ఆపై శాంతి సామరస్యాలు నెలకొంటున్నాయి
అన్న సమాచారాన్ని మనం చదవాలి

అవిగో నక్షత్రాలు మెఱుస్తున్నాయి

Wednesday, April 27, 2016
Topic(s) of this poem: star
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success